పిట్టల్లా రాలుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

పిట్టల్లా రాలుతున్నారు!

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

పిట్టల్లా రాలుతున్నారు!

వడదెబ్బతో 22 మంది మృతి

– 8లోu

సాక్షిప్రతినిధి, వరంగల్‌:

మ్మడి వరంగల్‌ జిల్లాలో ఎండలు రోజురోజుకూ దంచికొడుతున్నాయి. భానుడు మండిపోవడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. హనుమకొండ, వరంగల్‌, మహబూబా బాద్‌, ములుగు, జనగామ, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సగటున 42 నుంచి 45 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో జనజీవనం అతలాకుతలం అవుతోంది.

పెరుగుతున్న వడదెబ్బ కేసులు..

ఉమ్మడి జిల్లాలో వడదెబ్బ, ఎండ తీవ్రత కారణంగా బుధవారం నలుగురు, గురువారం 9, శుక్రవారం 11 మంది, శని వారం ఒక్క రోజే 22 మంది మృతి చెందారు. మొత్తంగా వారం రోజుల్లో 60 మందికిపైగా చని పోయినట్లు తెలుస్తోంది. తీవ్రమైన ఎండలు, వడగాలుల కారణంగా వడదెబ్బ కేసులు భారీగా పెరుగుతున్నాయి. డీహైడ్రేషన్‌, అలసట, జ్వరం, వాంతులతో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రులకు వచ్చే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా వ్యవసాయ కూలీలు, ఉపాధి హామీ కార్మికులు, ట్రాఫిక్‌ పోలీసులు, ఆటోడ్రైవర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు, షుగర్‌, బీపీ బాధితులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు.

రోడ్లు వెలవెల.. ప్రభుత్వపరంగా ఏర్పాట్లు అంతంతే

ఉదయం 11 గంటల తర్వాత మార్కెట్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులు వెలవెలబోతున్నాయి. ద్విచక్రవాహనదారులు ముఖానికి గుడ్డలు కట్టుకుని ప్రయాణిస్తుండగా.. చల్లని పానీయాలు, కొబ్బరి బోండాలు, మజ్జిగకు డిమాండ్‌ పెరిగింది. కాగా, ఎండల తీవ్రత పెరుగుతున్నప్పటికీ పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో చలివేంద్రాలు, తాగునీటి సౌకర్యం తగిన స్థాయిలో లేవన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఉపాధి హామీ పనుల ప్రదేశాల్లో నీడ, ఓఆర్‌ఎస్‌, తాగునీ లేదని కూలీలు చెబుతున్నారు.

మరో నాలుగు రోజులు..

మరో నాలుగు రోజుల పాటు ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగవచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని చెబుతున్నా వేడి తీవ్రత తగ్గే సూచనలు కనిపించడం లేదు.

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వారం రోజుల్లో 60 మందికిపైగా మృత్యువాత

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి ఆకుదారివాడకు చెందిన దుర్గం సమ్మక్క (50) పశువులకు పచ్చిగడ్డి కోసం శుక్రవారం పొలం వద్దకు వెళ్లింది. పచ్చిగడ్డి ఇంటికి తీసుకొచ్చే సరికి మిట్ట మధ్యాహ్నం అయ్యింది. పచ్చిగడ్డి మోపు దింపిన కొద్దిసేపటికే అస్వస్థతకు గురై మరణించింది.

కాజీపేటకు చెందిన వి.వెంకటేశ్‌ (26) ఎండదెబ్బకు గురై రైల్వేస్టేషన్‌ సమీపంలో శుక్రవారం కుప్పకూలి చనిపోయాడు. కిరాణం నుంచి సామాను తెస్తానని ఇంటి నుంచి బయలుదేరి ఎండవేడికి తట్టుకోలేక మృతిచెందాడు.

ములుగు జిల్లా మంగపేట మండలంలోని రామచంద్రుని పేటకు చెందిన ఊటుకూరి సోమిరెడ్డి (78) వడదెబ్బతో శనివారం మృతి చెందాడు. పూరేడుపల్లిలోని తన పంట పొలానికి వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.

45 డిగ్రీలు దాటిన

పగటి ఉష్ణోగ్రతలు

ఎండలతో ఆస్పత్రులకు

క్యూ కడుతున్న బాధితులు

రైతులు, కూలీలు, వృద్ధులపై తీవ్ర ప్రభావం

ఉదయం 11 గంటలకే

నిర్మానుష్యంగా రహదారులు

ఉమ్మడి వరంగల్‌ జిల్లా వ్యాప్తంగా ఘటనలు

Advertisement
 
Advertisement
Advertisement