పెయింటింగ్స్‌ అదుర్స్‌ | - | Sakshi
Sakshi News home page

పెయింటింగ్స్‌ అదుర్స్‌

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

పస్రా పోలీస్‌స్టేషన్‌ గోడలపై

సందేశాత్మక చిత్రాలు

గోవిందరావుపేట: పోలీస్‌స్టేషన్‌ గోడలపై వేయించి న అందమైన చిత్రాలు పలువురిని ఆకర్షిస్తున్నాయి. మహిళల భద్రత, బాలల రక్షణ, సైబర్‌ నేరాలపై అవగాహన, సామాజిక బాధ్యత తదితర అంశాల ను ప్రతిబింబించే చిత్రాలు అక్కడికి వచ్చే ప్రతీఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. పస్రా పోలీస్‌స్టేషన్‌ గో డలపై ఇటీవల పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో ప్రజలకు చట్ట పరిరక్షణే కాకుండా సామాజిక చైతన్యాన్ని అందించాలనే ఉద్దేశంతో ఈ చిత్రాలను వేయించారు. కళాత్మకంగా రూపొందించిన ఈ చిత్రాలు పోలీస్‌స్టేషన్‌కు కొత్త అందాన్ని తీసుకురావడంతో పాటు ప్రజలకు సానుకూల సందేశాలను చేరవేస్తున్నాయని పలువురు ప్రశంసిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement