అడ్మిషన్లు ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు ప్రారంభం

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

కారు, బైక్‌ ఢీ.. ఇద్దరి మృతి రాయితీపై పచ్చిరొట్ట విత్తనాలు

గోవిందరావుపేట: మండలంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌ చల్వాయిలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్లు ప్రారంభమైనట్లు ఎంపీడీఓ వరుణ్‌ కుమార్‌ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. టీజీఎంఎస్‌ చల్వాయిలో ఇంగ్లీష్‌ మీడియంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు తెలిపరాఉ. ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు ఈఏపీసెట్‌, నీట్‌, ఐఐటీ ప్రవేశ పరీక్షలకు ప్రత్యేక కోచింగ్‌ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కూడా అడ్మిషన్లు కొనసాగుతున్నాయని, హాస్టల్‌ వసతి సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు, తల్లిదండ్రులు నేరుగా పాఠశాలను సంప్రదించి అడ్మిషన్లు పొందవచ్చని, మరిన్ని వివరాలకు 8096350115 నంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

రూ.10 లక్షల

ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి

ములుగు రూరల్‌: వడదెబ్బ మృతులకు పది లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని సీపీఎం నాయకులు రవిగౌడ్‌ శనివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోలన్నారు. ఉపాధిహామి కూలీలు కచ్చితంగా నాలుగు గంటలు పని ప్రాంతంలో ఉండాలిన నిబంధన సడలించాలని ప్రభుత్వాన్ని కోరారు.

గుమ్మడిదొడ్డిలో

వైద్య శిబిరం

వాజేడు: మండల పరిధిలోని గుమ్మడిదొడ్డి గ్రామంలో సర్పంచ్‌ బోదెబోయిన భరత్‌ కుమార్‌ ఆధ్వర్యంలో శనివారం వైద్య శిబిరం నిర్వహించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వాజేడు వైద్యాధికారి నవీన్‌ ఆధ్వర్యంలో రోగులను పరీక్షించి మందులను అందజేశారు. హెచ్‌వీ వెంకట రమణ, ఏఎన్‌ఎం లలిత కుమారి, ఫార్మాసిస్టు రఘు, ఎల్టీ సూర్య, శివకుమారి, నాగ కుశల, కౌసల్య, కుసుమ,విజయ లక్ష్మి ఉన్నారు.

గుండెపోటుతో ప్రభుత్వ ఉపాధ్యాయుడి మృతి

ఏటూరునాగారం: ఐటీడీఏ పరిధిలోని చిన్నబోయినపల్లి గిరిజ ఆశ్రమ పాఠశాలలో ఎస్‌జీటీ ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బోదెబోయిన బుచ్చయ్య (59) గుండెపోటుతో శుక్రవారం రాత్రి మృతి చెందాడు. మండల కేంద్రంలోని 11 వార్డులో భార్య, పిల్లలతో ఉంటున్న బుచ్చయ్య ఇంటిలో ఎవరు లేని సమయంలో గుండెనొప్పితోపాటు పిడ్స్‌ రావడంతో బాత్‌రూమ్‌లో పడిపోయాడు. ఇరుగురు పొరుగు వారు చూసి వారి చిన్న కుమారుడు ప్రశాంత్‌కు సమాచారం ఇవ్వగా వచ్చి చూసే సరికి మృతి చెంది ఉన్నాడు. బుచ్చయ్యకు భార్య సమ్మక్క, కుమారులు మనోజ్‌, ప్రశాంత్‌ ఉన్నారు. ఐటీడీఏ ద్వారా దహన సంస్కారాల కింద ఆర్థిక సాయం అందజేశారు. గిరిజన ఉపాధ్యాయులు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. అయితే ఆయన స్వగ్రామం తాడ్వాయి మండలం మేడారం సమీపంలోని కన్నెపల్లిలో దహన సంస్కారాలను చేశారు.

వెంకటాపురం(ఎం): మండలంలోని నారాయణగిరిపల్లె వద్ద కారు, బైక్‌ ఎదురెదురుగా ఢీకొని శనివారం రాత్రి ఇద్దరు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని వెల్తుర్లపల్లి నుంచి బుద్దారం వైపు బైక్‌పై సలేంద్ర సాయికిరణ్‌, దీప్తి, లక్ష్మిలు వెళుతుండగా, బుద్దారం నుంచి వెల్తుర్లపల్లి వైపు వస్తున్న కారు నారాయణగిరిపల్లె సమీపంలో రాత్రి 11గంటలకు ఢీకొట్టింది. దీంతో బైక్‌ పై ప్రయాణిస్తున్న దీపిక అక్కడికక్కడే మృతిచెందగా లక్ష్మి, సాయికిరణ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌లో హన్మకొండలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ లక్ష్మి మృతిచెందినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని వెంకటాపురం పీఎస్సై సతీశ్‌ పరిశీలించారు.

రేగొండ: ప్రభుత్వం రాయితీపై అందజేస్తున్న పచ్చిరొట్ట విత్తనాలు మండల కేంద్రంలోని ఆగ్రోస్‌ సేవ కేంద్రంలో అందుబాటులో ఉన్నాయని కొత్తపల్లిగోరి మండల వ్యవసాయాధికారి సారయ్య ఒక ప్రకటనలో పేర్కొన్నారు. క్వింటాలు ధర రూ.16350 కాగా 50 శాతం రా యితీపై రూ.8175 చెల్లించాల్సి ఉంటుందన్నా రు. 30 కిలోల జీలుగ బస్తాకు రూ.2452.50 చెల్లించాలన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement