వాజేడు: చెరుకూరు నుంచి ధర్మవరం వరకు నిలిచి పోయిన రహదారిని వెంటనే పూర్తి చేయాలని సీపీఎం మండల కార్యదర్శి కొప్పుల రఘుపతిరావు డిమాండ్ చేశారు. మండల పరిధిలోని చెరుకూరు నుంచి ధర్మవరం వరకు ఉన్న రహదారిని శనివారం సీపీఎం నాయకులతో కలిసి ఆయన పరిశీలించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రహదారి మొత్తం గుంతలమయంగా మారడంతో ప్రయాణానికి ఇబ్బందులు తలెత్తడమే కాకుండా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయన్నారు. రెండు గ్రామాల మధ్య అటవీ శాఖ భూమి ఉందని రహదారి నిర్మాణ సమయంలో ఆ శాఖ అధికారులు అభ్యతరం వ్యక్తం చేయడంతో రహదారి నిర్మాణ పనులు నిలిచి పోయినట్లు తెలిపారు. అధికారులు కల్పించుకొని వెంటనే రహదారి నిర్మాణం జరిగేలా చర్యలను తీసుకోవాలని డిమాండ్ చేశారు. సదాక్రీన్, చంద్రశేఖర్, నరేష్, మహేందర్, సాయిబాబు తదితరులు ఉన్నారు.


