భూపాలపల్లి అర్బన్: కాళేశ్వరం పుష్కర ఘాట్‌ల వద్ద భక్తులు సమర్పించిన కొబ్బరికాయలను సేకరించి ఎండబెట్టడం ద్వారా పలువురు ఉపాధి పొందుతున్నారు. అంత్య పుష్కరాల సందర్భంగా భారీగా పేరుకుపోయిన కొబ్బరికాయలను స్థానికులు వేరు చేసి, చిప్పలు, కొబ్బరి ముక్కలను ఎండబెట్టి వ్యాపార అవసరాలకు సిద్ధం చేస్తున్నారు. ఎండిన కొబ్బరి ముక్కలను నూనె తయారీ, పశువుల మేత, ఇతర పరిశ్రమలలో వినియోగిస్తుండగా, చిప్పలను ఇంధనం, హస్తకళల తయారీలో ఉపయోగిస్తున్నారు. కొ బ్బరికాయల వ్యర్థాలను వినియోగంలోకి తీ సుకురావడం వల్ల పరిశుభ్రతకు తోడ్పాటు అందడ మే కాకుండా పలువురికి ఆదాయ వనరుగా మా రిందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.


