‘చేయూత’ అందేనా? | - | Sakshi
Sakshi News home page

‘చేయూత’ అందేనా?

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

341 మంది దరఖాస్తులు

మంగపేట: రాష్ట్ర అవతర దినోత్సవం సందర్భంగా జూన్‌ 02న రాష్ట్రంలోని 02 లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరీ చేయనున్ననుట్లు ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ప్రకటించింది. దీంతో నాలుగేళ్ల నుంచి పింఛన్ల కోసం ఎదురు చూస్తున్న లబ్ధిదారులు కొత్త పించన్ల జాబితాలో మంజూరు కోసం ఆశతో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులైన లబ్ధిరుల దరఖాస్తులను జిల్లా అధికారులకు పంపించేందుకు కసరత్తు ప్రారంభించారు. 2022లో వృద్ధాప్య పింఛన్‌ మంజూరుకు 60 సంవత్సరాల వయసును 57కు తగ్గించింది. మీసేవల ద్వారా దరఖాస్తులను స్వీకరించి 57 ఏళ్లు దాటిన వారందరికి వృద్ధాప్యం పించన్లు మంజూరీ చేసింది. 2022 జులై నుంచి ఇప్పటి వరకు కొత్త పించన్ల మంజూరీ నిలిచి పోయింది. 2025 జనవరి నుంచి ఒక కుటుంబంలో వృద్యాప్య పించన్‌ పొందే భర్త మరణిస్తే భార్యకు, భార్య మరణిస్తే భర్తకు మంజూరీ చేసే విధంగా స్పౌజ్‌ విధానాన్ని అమలు చేస్తున్నారు. మండంలోని 25 గ్రామ పంచాయతీలలో 2150 మందికి వృద్ధాప్యం, 2576 మందికి వితంతువు, 565 మందికి దివ్యాంగులు, 258 మంది ఒంటరి మహిళలకు ప్రతి నెలా ఆసరా పింఛన్లు వస్తున్నాయి. నాలుగు సంవత్సరాల తర్వాత రాష్ట్రంలో 02 లక్షల మందికి జూన్‌లో ఆసర పించన్లు మంజూరీ చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించడంతో ఈసారైనా తమ ఆశ తీరుతుందా అని లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు.

పింఛన్ల మంజూరుకు ప్రభుత్వం కసరత్తు

నాలుగేళ్లుగా లబ్ధిదారుల ఎదురుచూపు

దరఖాస్తులు స్వీకరిస్తున్న అధికారులు

2022 నుంచి ఇప్పటి వరకు ప్రజాపాలన గ్రామసభలు, ప్రజా ధర్బార్‌, జిల్లా గ్రీవెన్స్‌, స్వయంగా లబ్ధిదారుల నుంచి మండలంలోని 25 గ్రామ పంచాయతీల పరిధిలో వృద్ధాప్య 89, వితంతు 229, దివ్యాంగులు 15, ఒంటరి మహిళల 08 మొత్తం 341 మంది లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు వచ్చాయి. ఎవరైనా దరఖాస్తు చేయని అర్హులైన వారు ఉంటే ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులకు దరఖాస్తు చేసుకోవాలి.

– భద్రునాయక్‌, ఎంపీడీఓ

Advertisement
 
Advertisement
Advertisement