చిట్యాల(కాళేశ్వరం): కాళేశ్వరం పుణ్యక్షేత్రం వద్ద నిర్వహిస్తున్న అంత్య పుష్కరాలకు స్వీట్ హౌజ్ దుకాణాలు, హోటల్‌లు , టెస్కో క్లాత్ స్టాళ్ల యాజమానులు నాలుగు రోజుల క్రితం ముందే చేరుకుని ఏర్పాటు చేసుకున్నారు. పుష్కరాలకు అధికంగా భక్తులు వస్తారని స్వీట్ కొంటారనే ఆశతో స్వీట్ల యాజమానులు రూ.లక్షల పెట్టుబడి పెట్టారు. అలాగే కలెక్టర్, డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎండ తీవ్రత మూలంగా భక్తులు అంతంత మాత్రమే వస్తున్నారు. పుష్కరాలకు వచ్చిన భక్తులు స్వీట్లు కోనడం లేదు. స్టాళ్లలో ఏర్పాటు చేసిన హోటల్‌లలో గిరాకీ లేక యాజమానులు అవస్థలు పడుతున్నారు. అలాగే టేస్కో ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బట్టల దుకాణానికి ఎవరు రావడం లేదు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో భక్తులు ఆర్టీసీ బస్సులో బస్టాండ్‌కు వచ్చి గోదావరికి చేరుకుని అక్కడ పుణ్యస్నానాలు అచరించిన అనంతరం నేరుగా దేవాలయానికి వెళ్లి దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్నారు. దీంతో వివిధ షాపుల యాజమానులు గిరాకీ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు.
కాళేశ్వరంలో వెలవెలబోతున్న
షాపులు
ఆందోళనలో వ్యాపారులు


