రోడ్డు ఇలా.. నడిచేది ఎలా? | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ఇలా.. నడిచేది ఎలా?

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని శివాలయం వీధిలో రోడ్డుపై నీరు నిలిచి బురదమయంగా మారింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై మురుగు నీరు నిలిచి దుర్వాసన వస్తుందని స్థానికులు వాపోతున్నారు. మురగు నిల్వ ఉండడంతో దోమలకు అవాసాలుగా మారి వ్యాధుల బారిన పడుతున్నామని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్డుపై నీరు నిలిచి నడిచేందుకు వీలు లేకుండా పోయిందని అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన పట్టించుకోవటం లేదని తెలుపుతున్నారు. ఇప్పటికై న జిల్లా అధికారులు స్పందించి రోడ్డుపై మురుగు నిల్వ ఉండకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement