● కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి
ములుగు: బీఆర్‌ఎస్ ప్రభుత్వంలోనే రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని కాంగ్రెస్ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులు వరిపంట వేసుకోవద్దని తెలిపిందని పేర్కొన్నారు. దొడ్డు రకం పంటలను సాగుచేస్తే ధాన్యాన్ని కొనమని చెప్పి రైతులను ఇబ్బందులకు గురిచేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే రైతాంగానికి మేలు జరుగుతుందని తెలిపారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు యాసం రవికుమార్, మామిడిశెట్టి కోటి, నూనెటి శ్యామ్, గుంటోజు శంకరయ్య, నల్లెల్ల భరత్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు ఓం ప్రకాష్, గుంటోజు పావని, కేశెట్టి నవీన్ తదితరులు పాల్గొన్నారు.


