ఎస్‌ఎస్‌తాడ్వాయి: ఎండలు విపరీతంగా కొడుతున్న సందర్భంగా ఉపాధిహామీ కూలీలు జాగ్రత్తలు తీసుకోవాలని సర్పంచ్ ముక్తి శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పంబాపూర్ గ్రామపంచాయతీ పరిధిలో కొనసాగుతున్న ఉపాధిహామీ పనులను శనివారం ఆయన పరిశీలించారు. కూలీలకు మజ్జిగ పాకెట్లు, పెరుగు, అరటిపండ్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, శీతలపానీయాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని రోజులుగా ఎండలు తీవ్రంగా ఉండడంతో కూలీలు డీహైడ్రేషన్ బారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పోలేబోయిన సమ్మక్క, పంచాయతీ కార్యదర్శి భాస్కర్, మాజీ సర్పంచ్ కల్తీ నారాయణ, నాగేశ్వరావు, వెంకటేష్, రాజేందర్, కృష్ణ, ముక్తి రామారావు, రమేష్ పాల్గొన్నారు.


