ఎస్‌ఎస్ తాడ్వాయి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించే సంక్షేమ పథకాలను ఆదివాసీలు సద్వినియోగం చేసుకోవాలని ఏటూరునాగారం ఐటీడీఏ ఏపీఓ (జనరల్) కొమురం నాగోరావు అన్నారు. పీఎం– జుగా జన్ జాతీయ గరిమా ఉత్కర్స్ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం మండలంలోని కామారం (పీటీ) గ్రామంలో సర్పంచ్ కొర్నిబెల్లి సావిత్రి అధ్యక్షతన గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఐటీడీఏ ఏపీఓ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతో ‘జన్ భాగీదారి అభియాన్’లో భాగంగా ఈ నెల 18 నుంచి 25వ తేదీ వరకు గ్రామసభలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉమ్మడి ఏటూరునాగారం ఐటీడీఏ పరిధిలో 196 గ్రామాల్లో ప్రజల అభిప్రాయాలు వినడం, సమస్యలు పరిష్కరించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కొర్నిబెల్లి జగన్నాధరావు, హన్మతయ్య, వైద్య అధికారి ప్రశాంత్, ఏసీఎంఓ వాగ్యానాయక్, జీసీడీఓ పెనక సుగుణ, పీసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్, పంచాయతీ కార్యదర్శి రమేష్, మొబిలైజర్ చర్ప రవి, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఐటీడీఏ ఏపీఓ(జీ) కొమురం నాగోరావు


