● ధ్రువీకరించిన అటవీశాఖ అధికారులు
వెంకటాపురం(కె): మండల పరిధిలోని యాకన్నగూడెం, ఎదిర గుట్టల సమీపంలో చిరుత పులి సంచరిస్తుంది. చిరుత సంచారం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు, సిబ్బంది ఎఫ్‌డీఓ ద్వాలియా ఆధ్వర్యంలో ఎదిర, యాకన్నగూడెం గ్రామ శివారుల్లో చిరుతపులి సంచరించిన ప్రాంతానికి వెళ్లి ఆనవాళ్లను పరిశీలించారు. చిరుత సంచరిస్తున్నట్లుగా పాదముద్రలను గుర్తించారు. ఈ సందర్భంగా ద్వాలియా మాట్లాడుతూ గ్రామస్తులు అటవీ ప్రాంతానికి సమీపంలో పశువులను గొర్రెలను మేపేందుకు వెళ్లొద్దని సూచించారు. పిల్లలు, మహిళలు సాయంత్రం సమయంలో ఒంటరిగా ఇళ్ల నుంచి బయటకు రావొద్దని తెలిపారు. చిరుత కనిపిస్తే దానికి హానికలిగించకుండా తక్షణమే అటవీశాఖ సి బ్బందికి సమాచారం ఇవ్వాలని కోరారు. వ్యన్య ప్రాణి సంరక్షణ చట్టం ఉల్లంఘనకు పాల్పడితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.


