టీజీఐసీసీసీ సూచన
రెడ్‌జోన్‌లో ములుగు జిల్లా
–8లోu
ములుగు: భానుడు భగ్గుమంటున్నాడు. జిల్లాలో రో జురోజుకూ రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. శుక్రవారం జిల్లా రెడ్‌జోన్ పరిధి లోకి వెళ్లింది. ప్రతీ మండలంలో 45 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. అత్యధికంగా జిల్లాలోని తాడ్వాయి, వెంకటాపురం మండలాల్లో 46.4 డిగ్రీలు, ఏటూరునాగారంలో 46.3 డిగ్రీలు, మల్లంపల్లి, వాజేడు, మంగపేట, వెంకటాపురం(కె) మండలాల్లో 46 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో జనం విలవిలలాడుతున్నారు. రెండు రోజుల క్రితం 43 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కరోజు తేడాతోనే మూడు నుంచి నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రత పెరగడంతో ప్రజలు ఎండ తీవ్రతకు అవస్థలు పడుతున్నారు. ఉదయం 9 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపుతుండడంతో జనం బయటకు వచ్చేందుకు వెనకడుగు వేశారు. మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి పట్టణం, పల్లె అనే తేడా లేకుండా వీధులు, ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. అత్యవసరమైతే తప్ప జనం బయటకు వచ్చే పరిస్థితి కనిపించలేదు.
ఇబ్బందులు పడుతున్న రైతులు, కూలీలు
యాసంగి పనులు చివరిదశలో ఉన్న తరుణంలో భానుడి ప్రతాపానికి రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. వరిపంటను విక్రయించే క్రమంలో లా రీల కొరత కారణంగా ధాన్యాన్ని తరలించే పరిస్థితి లేకపోవడంతో కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఉపాధి పనులు చేసే కూలీలకు పనిచేసే ప్రదేశంలో సరైన వసతులు లేకపోవడంతో ఉదయం 10 గంటలలోపే పనులను ఉపాధి పనులను ముగించుకుంటున్నారు. రైతులు, కూలీలు, పంచాయతీ కార్మికులు వడదెబ్బకు గురికాకుండా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వడగాలులతో అల్లాడుతున్న జనం
ఉదయం 11 గంటల నుంచే వీస్తున్న వడగాలులతో జనం అల్లాడుతున్నారు. పగలు వడగాలులు, రాత్రిఉక్కపోతతో విలవిలలాడుతున్నారు. ఫ్యాన్లు, కూ లర్లు, ఏసీలను వాడుకుంటుండడంతో విద్యుత్ విని యోగం కూడా పెరిగింది. ప్రజలు అత్యవసర పనులు ఉంటే తప్ప బయట కనిపించడం లేదు. ప్రధాన రహదారులన్నీ వెలవెలబోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా ప్రజలెవరూ 12 నుంచి సాయంత్రం 4 గంటలలోపు బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు ఎండలో తిరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు.
జిల్లాలో శుక్రవారం నమోదైన
ఉష్ణోగ్రతలు (డిగ్రీలు సెల్సియస్‌లో)
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏడుగురి మృతి
‘మీ ప్రాంతంలో తీవ్ర ఎండలు.. వేడి గాలులు వీచే అవకాశం ఉంది. 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య ఎవరూ బయటకు వెళ్లొద్దు. నీరు, మజ్జిగ, కొబ్బరినీరు తాగండి.. అస్వస్థత ఉంటే వైద్యసాయం పొందండి’ అంటూ జిల్లాలోని ప్రజల సెల్‌ఫోన్లకు తెలంగాణ రాష్ట్ర సమగ్ర నియంత్రణ కేంద్రం (టీజీఐసీసీసీ) ద్వారా మేసేజ్‌లు వస్తున్నాయి.
46.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వడగాలులకు అల్లాడుతున్న జనం
ప్రధాన రహదారులన్నీ నిర్మానుష్యం
మండలం ఉష్ణోగ్రత
తాడ్వాయి 46.4
వెంకటాపురం 46.4
ఏటూరునాగారం 46.3
మల్లంపల్లి 46.1
వాజేడు 46.1
మంగపేట 46.0
వెంకటాపురం(కె) 46.0
ములుగు 45.9
కన్నాయిగూడెం 45.8
గోవిందరావుపేట 45.4


