తప్పని గ్యాస్‌ తిప్పలు | - | Sakshi
Sakshi News home page

తప్పని గ్యాస్‌ తిప్పలు

May 23 2026 1:52 AM | Updated on May 23 2026 1:52 AM

ఏటూరునాగారం: జిల్లాలో గ్యాస్‌ వినియోగదారులకు ఇంకా తిప్పలు తప్పడం లేదు. గత నెలలో జరిగిన అమెరికా–ఇరాన్‌ దేశాల మధ్య యుద్ధంతో గ్యాస్‌ సరఫరా అందని ద్రాక్షలా మారింది. గ్యాస్‌ వినియోగం పెరగడంతో ఒక్కో వినియోగదారుడికి 45 రోజుల కాల వ్యవధిని ప్రభుత్వం నిర్ణయించింది. గ్యాస్‌ తీసుకున్న నాటి నుంచి 45 రోజుల వరకు బుకింగ్‌ చేసుకోకుండా షరతులు విధించింది. దీంతో చిన్న చిన్న హోటల్‌ యజమానులు పాత పద్ధతు లను అలవాటు చేసుకుంటున్నారు. గ్యాస్‌ సిలిండ ర్లు, స్టౌవ్‌లను పక్కకు పడేసి అడవి నుంచి వంట చె ఱుకు (పొయ్యిల కట్టెలు) తెప్పించుకుంటున్నారు. అయితే గతంలో ఎడ్లబండితో కట్టెలను రూ.1,000 లకు వేస్తే ప్రస్తుతం అది రూ.1,500 పెంచారు.

చిరు వ్యాపారుల అవస్థలు

సకాలంలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ అందకపోవడంతో చిన్న చిన్న హోటళ్లు, టిఫిన్‌ సెంటర్ల నిర్వాహకులు అవస్థలు పడుతున్నారు. తప్పని పరిస్థితుల్లో కట్టెల పొయ్యిపై వంట చేస్తున్నారు. మరికొందరు బ్లాక్‌ మార్కెట్లో గ్యాస్‌ సిలిండర్లను కొంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుని ప్రజలకు గ్యాస్‌ కష్టాలను తొలగించాలని కోరుతున్నారు.

కేవైసీ తప్పనిసరి

గ్యాస్‌ కనెక్షన్‌ ఉన్న ప్రతీ వినియోగదారుడు వారి వేలిముద్ర, ఐరీస్‌ను గ్యాస్‌ ఏజెన్సీకి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంది. ఈ–కేవైసీ చేయని వారికి గ్యాస్‌బుక్‌ కావడం లేదు. దీంతో హెచ్‌పీ ఏజెన్సీ అయిన జీసీసీ, ఇండేన్‌, భారత్‌ గ్యాస్‌ లాంటి కంపెనీలు కేవైసీ తప్పనిసరి చేసింది. అత్యధికంగా హెచ్‌పీ గ్యాస్‌ కనెక్షన్లు ఉన్న జీసీసీ ఏజెన్సీ సరఫరాలో జాప్యం, నిర్లక్ష్యం చేస్తుందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు.

అడవి నుంచి కట్టెలను

తెస్తున్న వ్యాపారులు

45 రోజులు దాటినా అందని గ్యాస్‌ సిలిండర్లు

ఏజెన్సీల చుట్టూ తిరుగుతున్న

వినియోగదారులు

జిల్లాలో నో కమర్షియల్‌ గ్యాస్‌

మూత పడుతున్న చిన్న చిన్న హోటళ్లు

కట్టెల పొయ్యిలను వినియోగిస్తున్న పలువురు వ్యాపారులు

Advertisement
 
Advertisement
Advertisement