ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి

May 21 2026 5:03 AM | Updated on May 21 2026 5:03 AM

ములుగు రూరల్‌: ప్రభుత్వ ఆస్పత్రిలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సిరికొండ బలరాం అన్నారు. ఈ మేరకు బుధవారం ములుగు పట్టణ అధ్యక్షుడు ఇమ్మడి రాకేశ్‌ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో శానిటేషన్‌ సిబ్బంది సరిపడా లేకపోవడంతో ఆస్పత్రి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయిందన్నారు. ఆస్పత్రిలో మౌలిక వసతులు టాయిలెట్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. జిల్లాకు పెద్ద దిక్కయిన ఆస్పత్రిలో ఆదివాసీ గిరిజనులకు సరైన వైద్యం అందడం లేదని వాపోయారు. ప్రభుత్వం, మంత్రి సీతక్క ఆస్పత్రిని గాలికి వదిలేశారని వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన వైద్యం అందక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. మౌలిక వసతులు లేని కారణంగా రోగులను ఎక్కువగా ఎంజీఎంకు తరలిస్తున్నారని తెలిపారు. పలుమార్లు సమస్యల పరిష్కారాలని కోరిన పట్టించుకోవడం లేదన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి ఈ నెల 25న బీజేపీ ఆధ్వర్యంలో 48 గంటల నిరహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు భాస్కర్‌రెడ్డి, జిల్లా ప్రధాన కార్యర్యదర్శి నగరపు రమేశ్‌, రవీంద్రాచారి, సుమలత, దొంతిరెడ్డి వాసుదేవరెడ్డి, రవిరెడ్డి, హేమాద్రి, ప్రమోద్‌రెడ్డి, రవి, రాకేశ్‌, సుధీర్‌ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీ జిల్లా అధ్యక్షుడు బలరాం

Advertisement
 
Advertisement
Advertisement