ములుగు రూరల్: ఔషధాల అమ్మకాలను ఆన్‌లైన్‌లో నిలిపివేయాలని కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన బంద్ విజయవంతమైందని అసోసియేషన్ అధ్యక్షుడు తిప్పని కోటేశ్వర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం అసోసియేషన్ ఆ ధ్వర్యంలో దేశవ్యాప్త మెడికల్ షాపుల బంద్‌లో భా గంగా జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా సమయంలో కేంద్ర ప్రభుత్వం జీఓను సవరిస్తూ ఔషధాలను ఆన్‌లైన్ మార్కెటింగ్‌కు అనుమతి ఇచ్చిందని తెలిపారు. నేటికీ అదేవిధంగా కొనసాగించడం సరి కాదని తెలిపారు. కార్పొరేట్ సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న చైన్ మెడికల్ షాపుల్లో డిస్కౌంట్ల పేరుతో అక్రమాలకు పాల్పడుతున్నారని వివరించారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కోశాధికారి శ్రీధర్‌రావు, సభ్యులు అనిల్, రమేశ్ తదితరులు పాల్గొన్నారు.


