మహాముత్తారం : మండలంలోని నిమ్మగూడెం, యత్నారం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు అమర్చిన విద్యుత్ తీగలకు తగిలి చనిపోయిన జంతువును కాల్చివేశారు. ఈ సంఘటనపై ఫ్లైయింగ్ స్క్వాడ్ డీఎఫ్‌ఓ జోగేందర్‌తోపాటు ఎఫ్‌డీఓ సందీప్‌రెడ్డి బుధవారం సంఘటన స్థలానికి చేరుకొని మహాముత్తారం పశు వైద్యాధికారి భరత్‌తో కలిసి కాల్చివేసిన జంతువు కళేబారం నమూనాను సేకరించి ల్యాబ్‌కు పంపించినట్లు తెలిపారు. ఈ ఘటన ఆధారంగా యత్నారం గ్రామంలో కొంతమంది అనుమానితులను ప్రశ్నించగా గ్రామానికి చెందిన కోడి మాంతయ్య ఇంట్లో ఉచ్చుకు వినియోగించే విద్యుత్ తీగలు దొరికినట్లు తెలిపారు. అదే విధంగా గ్రామానికి చెందిన పుల్యాల నగేష్, రాజు, కాసిపేట కృష్టస్వామితో వెళ్లినట్లు మంతయ్య ఇచ్చిన సమాచారం మేరకు నలుగురిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పేర్కొన్నారు.


