మురుగును తొలగించరూ..! | - | Sakshi
Sakshi News home page

మురుగును తొలగించరూ..!

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

కన్నాయిగూడెం : మండల కేంద్రంలోని గూర్రేవుల గ్రామ పంచాయతీలో డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా తయారయ్యాయి. ప్రధాన రహదారికి సరైనా డ్రెయినేజీ కాల్వలు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇంట్లో వాడినా మురుగు నీరు రోడ్డు పక్కన నిలిచి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో ఆయా ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. మురుగును తొలగించాల్సిన పంచాయతీ అధికారులు, పాలకులు పట్టించుకోవడం లేదని స్థానికులు విమర్శిస్తున్నారు. మురుగును తొలగించాలని పలుమార్లు చెప్పిన పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. గ్రామంలోని మదనం పోశమ్మ ఆలయం వద్దకు నిత్యం ప్రజలు, భక్తులు మొక్కులు చెల్లించుకోవానికి వస్తుంటారు. గుడి సమీపంలో రోడ్డుపక్కన నెలల తరబడి మురుగు నీరు చేరడంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి మురుగును తొలగించాలని కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement