జన జాతీయ గరిమ్‌ ఉత్సవ్‌ ర్యాలీ | - | Sakshi
Sakshi News home page

జన జాతీయ గరిమ్‌ ఉత్సవ్‌ ర్యాలీ

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

వాజేడు: మండల కేంద్రంలో బుధవారం జన జాతీయ గరిమ్‌ ఉత్సవ్‌ 2026 ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి ఐటీడీఏ పీఓ లెనిన్‌ వత్సల్‌ టొప్పో హాజరై సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఇందులో గిరిజనుల అభివృద్ధికి చర్యలు, వైద్యసేవలు తదితర పథకాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో నాగారం సర్పంచ్‌ బోదెబోయిన స్వరూప, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీఓ శ్రీకాంత్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement