ఎండతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి | - | Sakshi
Sakshi News home page

ఎండతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

వెంకటాపురం(కె) : మండల పరిధిలోని పాత్రాపురం పంచాయతీ పాలెం గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్యాఽధికారి భాస్కర్‌ ఆధ్వర్యంలో హెల్త్‌ స్కీనింగ్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ శిబిరంలో రక్తపోటు, మధుమేహం, గర్భిణులకు హిమోగ్లోబిన్‌ టెస్టులు చేశారు. జ్వరంతో బాధపడుతున్న వారి నుంచి రక్త నమూనాలు సేకరించారు. అనంతరం వైద్యాధికారి భాస్కర్‌ మాట్లాడుతూ.. ఎండ తీవ్రత ఎక్కవ ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఉపాధి హామీ పనులకు వెళ్లే వారు నిమ్మరసం, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను తప్పనిసరిగా వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ పుష్పవతి, ఉప సర్పంచ్‌ ఇల్లందుల శ్రీను, పంచాయతీ కార్యదర్శి శ్రావణ్‌, తదితరులు ఉన్నారు.

మల్లంపల్లిలో కంటి వైద్యశిబిరం

ములుగు రూరల్‌ : మండల పరిధిలోని మల్లంపల్లి గ్రామంలో ఎన్‌ఎస్‌ చారిటబుల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో శంకర కంటి ఆస్పత్రి హైదరాబాద్‌ వారు ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 56 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 26 మందికి కంటి ఆపరేషన్‌ నిమిత్తం హైదరాబాద్‌కు తరలించారు. ట్రస్టు చైర్మన్‌ మహేష్‌ ఉన్నారు.

కొండాయిలో..

ఏటూరునాగారం : మండలంలోని కొండాయి గ్రామంలో బుధవారం వైద్యశిబిరం నిర్వహించారు. ఐటీడీఏ పీఓ లెనిన్‌వత్సల్‌ టొప్పో ఆదేశాల మేరకు జన జాతీయ గరీమ్‌ ఉత్సవ్‌లో భాగంగా వైద్య శిబిరం నిర్వహించి 25 మందికి పరీక్షలు చేసినట్లు కొండాయి పల్లె దవాఖానా వైద్యుడు ప్రణీత్‌ తెలిపారు. జ్వరంతో ఉన్న వారికి పరీక్షలు చేసి తగు జాగ్రత్తలు వివరించామన్నారు. ఈ వేసవిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ఎక్కువగా వినియోగించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ఆలం మానస, హెల్త్‌ అసిస్టెంట్‌ కె.భాస్కర్‌ రావు, కార్యదర్శి వేణు, ఏఎన్‌ఎం సమ్మక్క, పా యం రాకేష్‌, స్వప్న, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement