ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు నిలిపివేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు నిలిపివేయాలి

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

వెంకటాపురం(కె) : ఆన్‌లైన్‌ విధానంలో మెడికల్‌ విక్రయాలు నిలిపివేయాలని కెమిస్ట్‌, డ్రగిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పూర్ణ చందర్‌రావు అన్నారు. బుధవారం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా మండలంలోని మెడికల్‌ షాపులను బంద్‌ చేశారు. అనంతరం మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. నాయకులు మట్ట రామకృష్ణ, రామ్మూర్తి, ముస్తాఫా, రాంబాబు, అంకారావు, శ్రీనివాస్‌, నరహారి, జయసింహ, కిషోర్‌, వెంకట్‌, జోగారావు, బాబురావు తదితరులు ఉన్నారు.

మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం

వాజేడు : ఆన్‌లైన్‌లో మెడికల్‌ విక్రయాలకు వ్యతిరేకంగా చేపట్టిన మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతమైంది. ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మండల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో బుధవారం మెడికల్‌ షాపుల బంద్‌ నిర్వహించారు. అనంతరం ర్యాలీ చేపట్టారు. మొగిలి, రత్న శంకర్‌, నరేందర్‌, నర్సింహరావు, రాము, హరిబాబు, భాస్కర్‌, రాజేష్‌, అబ్ధుల్లా, రాజు తదితరులు ఉన్నారు.

మెడికల్‌ షాపు యజమానుల ర్యాలీ

మంగపేట : ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ (ఏఐఓసీడీ) పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా తలపెట్టిన మెడికల్‌ షాపుల బంద్‌కు మద్దతుగా మండలంలోని మెడికల్‌ షాపుల యజమానులు దుకాణాలను మూసివేసి బుధవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని కమలాపురం, మంగపేట, మల్లూరు, రాజుపేట తదితర గ్రామాల్లోని మెడికల్‌ షాపులను మూసేసి ఆయా గ్రామాల్లో ర్యాలీ నిర్వహించారు. కోవిడ్‌ సమయంలో మందుల విక్రయాలపై కేంద్రం ఇచ్చిన ఆదేశాలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. నాయకులు కరివర్ధన్‌, శ్రీనివాసరెడ్డి, శశిధర్‌, తదితరులు పాల్గొన్నారు.

మెడికల్‌ షాపుల యజమానులు బంద్‌ నిరసన

ఏటూరునాగారం : మండలంలోని మెడికల్‌ షాపులు బంద్‌ చేసి ప్రధాన రోడ్డుపై యజమానులు నిరసన వ్యక్తం చేశారు. జిల్లా గౌరవ సలహాదారుడు అజ్మత్‌ఖాన్‌, సయ్యద్‌ గౌస్‌పాషా, బొరగాని బాపురావు, లక్ష్మణ్‌దేవ్‌, ఉమేష్‌, శివశంకర్‌, కిరణ్‌, ముజీబ్‌, సతీష్‌, నాగేశ్వర్‌రావు, మహేందర్‌, నాగరాజు, శ్రీనివాస్‌, ఇమ్రాన్‌, వాజీత్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement