గోవిందరావుపేట : మండలంలోని చల్వాయి గ్రామానికి చెందిన మద్దినేని లక్ష్మి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందింది. కాగా బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్ సూచన మేరకు.. ఆ పార్టీ గ్రామ అధ్యక్షుడు వేల్పుగొండ ప్రకాశ్ ఆధ్వర్యంలో రూ.6 వేలు ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ మేకల రాధాసుదర్శన్, నాయకులు తేళ్ల హరిప్రసాద్, నరేందర్ రెడ్డి, సారయ్య, వెంకటేష్, భిక్షపతి, అశోక్ తదితరులు పాల్గొన్నారు.
వాజేడులో..
వాజేడు : మండల కేంద్రంలోని నాగారం వీధికి చెందిన కుర్సం చందర్ రావు వడదెబ్బతో మృతి చెందాడు. కాగా బాధిత కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కాకర్లపూడి విక్రాంత్ దహన సంస్కారాల నిమిత్తం బుధవారం రూ.5వేల ఆర్థికసాయం అందించారు. వత్సవాయి జగన్నాథరాజు, సీతాలు, కృష్ణ ఉన్నారు.


