నిరుపయోగంగా చలివేంద్రాలు | - | Sakshi
Sakshi News home page

నిరుపయోగంగా చలివేంద్రాలు

May 21 2026 4:57 AM | Updated on May 21 2026 4:57 AM

కన్నాయిగూడెం : వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చాడానికి జనావాసాలు ఉన్న ప్రధాన రహదారులపై గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు కొన్ని గ్రామ పంచాయతీల్లో నీరులేకుండా అపరిశుభ్రంగా మారాయి. మండుటెండలో పనులకు వెళ్లి వస్తున్న వారి దాహాన్ని తీర్చలానే ఉద్దేశంతో ప్రతీ గ్రామ పంచాయతీ పరిధిలో జీపీ కార్యదర్శులు, సర్పంచ్‌లు చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. మొదట బాగానే ఉన్న కొన్ని రోజుల తర్వాత పంచాయతీ అధికారులు నిర్వహణను పూర్తిగా మరిచి పోయారు. కుండల్లో నీరులేకుండా అపరిశుభ్రంగా తయారయ్యాయి. అక్కడా నీరు లేకపోవడంతో దాహం వేసిన ప్రజలు అందుబాటులో ఉన్న షాపుల్లో వాటర్‌ బాటిల్లు కొనుగోలు చేసి వారి దాహాన్ని తీర్చుకుంటున్నారు. దీంతో ఏర్పాటు చేసిన చలివేంద్రాలు నిరుపయోగంగా మారడంతో పేరుకు మాత్రమే ఏర్పాటు చేశారా అని మండల ప్రజలు విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా సర్పంచ్‌లు చొరవ తీసుకొని చలివేంద్రాల్లో తాగునీరు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

ప్రజలకు తప్పని నీటి తిప్పలు

పట్టించుకోని అధికారులు

Advertisement
 
Advertisement
Advertisement