ములుగు: అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డు అందేలా చూడాలని కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అన్నారు. కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో మంగళవారం జిల్లా అక్రిడిటేషన్ కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లాలో పనిచేస్తున్న ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధుల అక్రిడిటేషన్ దరఖాస్తులను కమిటీ పరిశీలించింది. అర్హత కలిగిన జర్నలిస్టులకు అక్రెడిటేషన్ కార్డుల జారీతో పాటు పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హేమంత్ సహదేవరావు మాట్లాడుతూ అక్రిడిటేషన్ మార్గదర్శకాలు నూతనంగా విడుదల కాగా ప్రభుత్వ ఉత్తర్వుల్లోని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించినట్లు తెలిపారు. వాటిలోని అంశాలను పరిగణనలోకి తీసుకుని జిల్లాలో అర్హులైన ప్రతీ ఒక్క జర్నలిస్టుకు అక్రిడిటేషన్ కార్డు అందే విధంగా చూడాలని కమిటీ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. ప్రజాస్వామ్యంలో మీడియా పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో జర్నలిస్టులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సంబంధాల అధికారి ఎండి.రఫీక్, కమిటీ సభ్యులు ఎండి.షఫీ అహ్మద్, గాదం దేవేందర్, బి. పృధ్వీరాజ్, బండారి లక్ష్మణ్, అబ్దుల్ గఫార్, చుంచు రవి, రాజేష్, వడ్లకొండ వీరయ్య, బి.అశోక్, జూనియర్ అసిస్టెంట్ కొత్తపల్లి శంకర్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు


