భూపాలపల్లి అర్బన్: సింగరేణి సంస్థ అభివృద్ధికి ఉద్యోగుల సమష్టి కృషి అవసరమని భూపాలపల్లి ఏరియా జనరల్ మేనేజర్ ఏనుగు రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. మంగళవారం కేటీకే 5వ గనిలో నిర్వహించిన మల్టీ డిపార్ట్‌మెంటల్ సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ.. ప్రతీ ఉద్యోగి క్రమశిక్షణ, అంకితభావంతో విధులు నిర్వహించాలని సూచించారు. నాణ్యత, ఉత్పత్తి, ఉత్పాదకత పెంపు కోసం సమష్టిగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఉద్యోగుల సంక్షేమానికి సింగరేణి సంస్థ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళా ఉద్యోగులు కూడా ధైర్యంగా ముందుకు సాగుతూ భూగర్భ గనుల్లో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు.
టెండర్ల ఆహ్వానం
మామునూరు: వరంగల్ మామునూరు విమానాశ్రయం అభివృద్ది పనుల కోసం అధికారులు టెంబర్లను ఆహ్వానించినట్లు తెలిసింది. ఎయిర్‌పోర్ట్ అథారిటీ అధికారులు ఇటీవల పర్యటించిన విషయం తెలిసిందే. భూ నిర్వాసితుల నుంచి సేకరించిన రన్‌వే స్థలానికి పెన్షింగ్, బోర్డులు ఏర్పాటు, ప్రాంగణంలోని ఏపుగా పెరిగిన ముళ్లపొదలు, ఇతర చెట్ల తొలగింపు, విమానాశ్రయంలో భూసార పరీక్షలకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేసినట్లు సమాచారం. రూ.20 లక్షల కేటాయించగా 180 రోజుల్లో పర్యావరణ అనుమతులు, భూసార పరీక్షలు నిర్వహించేందుకు టెండర్‌దారులనుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిసింది.


