లారీ ఢీకొని పాడిగేదె మృతి | - | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని పాడిగేదె మృతి

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

లారీ ఢీకొని పాడిగేదె మృతి

మంగపేట: మండలంలోని రమణక్కపేటలో రోడ్డు దాటుతున్న పాడి గేదెను ఇసుక లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందిన సంఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సంఘటన వివరాల మేరకు అభయాంజనేయస్వామి ఆలయం వద్ద పాడిగేదె రోడ్డు దాటు తుండగా మణుగూరుౖ వెపు నుంచి ఇసుక లారీ వేగంగా వచ్చి ఢీకొట్టడంతో పాడిగేదె మృతి చెందింది. పాడిగేదె విలువ సుమారు రూ.40 వేల వరకు ఉంటుందని గ్రామస్తులు తెలిపారు. స్థానికులు లారీని నిలిపివేసి నిరుపేద కుటుంబానికి చెందిన పాడిగేదె యజమాని చదలవాడ వెంకటనర్సమ్మ నష్టపరిహారం చెల్లించాలని డ్రైవర్‌ను డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement