ఫొటో రాక పనికి వెళ్తలేను.. | - | Sakshi
Sakshi News home page

ఫొటో రాక పనికి వెళ్తలేను..

May 20 2026 2:04 AM | Updated on May 20 2026 2:04 AM

ఉపాధి పనికి వెళ్లేందుకు రోజు కూలీలను ఫొటో తీసేచోటికి వెళ్తున్నా. నా కళ్లు ఫొటో తీసేటప్పుడు రాకపోవడంతో ఇప్పటికి ఐదు రోజుల నుంచి పనికి వెళ్తలేను. ఈ కేవైసీ చేసినా కళ్ల ఫొటో వస్తాలేదు. ఇప్పటికై నా నా ఫోటో వచ్చేలా సార్లు చూడాలి. పనికి వెళ్లాలని ఉన్నా ఫొటో పడకపోవడంతో ఖాళీగా ఉంటున్నా.

– వీరమ్మ, ఉపాధి కూలీ టేకుమట ్ల

సమస్య లేకుండా చూస్తున్నాం..

క్యాప్చర్‌ మస్టర్‌ రోల్‌ అటెండెన్స్‌లో ఐరీష్‌ను క్యాప్చర్‌ తీసుకోవడంలో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఈకేవైసీ చేస్తున్నాం. ఈ కేవైసీ చేసినా ఐరిస్‌ క్యాప్చర్‌ కాకుంటే ఆధార్‌ ఆప్‌డేట్‌ చేసుకోవాలని సూచిస్తున్నాం. మస్టర్‌లో పేరున్న అందరికి ఉపాధి హామీలో పని కల్పించడం కోసం కృషి చేస్తాం.

– రమేశ్‌, ఏపీఓ, టేకుమట్ల

Advertisement
 
Advertisement
Advertisement