ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని బంధాల గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో ఉపాధిహామీ పనుల వద్ద సర్పంచ్ మంకిడి శ్రీలత మంగళవారం చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. కూలీల సమస్యలపై ఇటీవల ‘సాక్షి‘లో ఉపాధి కూలీల సౌకర్యాలపై పట్టింపేది? అనే కథనం ప్రచరితం కావడంతో అధికారులు స్పందించారు. మండుతున్న ఎండల మధ్య పని చేస్తున్న కూలీల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని నీడ కోసం గ్రీన్ మ్యాట్‌తో పందిరి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా చల్లని తాగునీరు అందించేందుకు చలివేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ శ్రీలత తెలిపారు. అనంతరం కూలీలకు అరటిపండ్లు పంపిణీ చేశారు.
కాంగ్రెస్‌లో చేరిక
మహాముత్తారం: మండల కేంద్రానికి చెందిన సినియర్ బీఆర్‌ఎస్ నాయకుడు రామచంద్రం సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు కొంగొర్ల బాపు ఆధ్వర్యంలో మంగళవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయనకు మంత్రి దుద్దిళ్ల శ్రీదర్‌బాబు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. తాటి లచ్చయ్యగౌడ్ ఉన్నారు.
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మండలంలోని మేడారంలో అనారోగ్య కారణంగా 65 సంవత్సరాల గుర్తు తెలియని యాచకుడు ఈనెల 18న మృతి చెందినట్లు నార్లాపూర్‌పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం ములుగు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి ప్రస్తుతం ఫ్రిజర్‌లో భద్రపరిచినట్లు తెలిపారు. మృతుడి బంధువులు, రక్త సంబంఽధీకులుగానీ మేడారంలోని నార్లాపూర్ పోలీస్ స్టేషన్‌కు రావాలన్నారు. యాచకుడి గురించి ఎవరికై నా సమాచారం తెలిస్తే 87126 30132 నంబర్‌ను సంప్రదించాలన్నారు.
మనస్తాపంతో
యువకుడి ఆత్మహత్య
గణపురం: మండలకేంద్రానికి చెందిన జక్కు వినయ్ (25) ఆరోగ్యం సహకరించడం లేదని మనస్తాపానికి గురై పరుగుల మందు తాగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. మండలకేంద్రానికి చెందిన జక్కున వినయ్ కొంత కాలంగా కిడ్నీల సంబంధిత వ్యాధితో ఎన్ని ఆస్పత్రులకు పోయిన నయం కావడం లేదు. దీంతో మనస్థాపంతో సోమవారం రాత్రి పరుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలిస్తున్న క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడు తండ్రి జక్కు రవీందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.
ఏటూరునాగారం: మండల కేంద్రంలోని 11 వార్డులోని నివాసం ఉంటున్న ఆగమ్మ (85) అనే వృద్ధురాలు జీవితంపై విరక్తి చెంది ఇంటిలో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉదయం ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.


