ప్రణాళికతో ముందుకు సాగాలి | - | Sakshi
Sakshi News home page

ప్రణాళికతో ముందుకు సాగాలి

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

ప్రణాళికతో ముందుకు సాగాలి

వాజేడు: విద్యార్థులు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాలని ఎంపీడీఓ శ్రీకాంత్‌ నాయుడు, ఎంఈఓ తేజావత్‌ వెంకటేశ్వరరావు అన్నారు. మండల కేంద్రంలోని ఎంఈఓ కార్యాలయం ఆవరణలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మండల టాపర్లుగా నిలిచిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను సన్మానించారు. మంద రిషిత్‌, మొడెం వైష్ణవి, కేశబోయిన అంజలిలు పదవ తరగతి ఫలితాల్లో మండలం నుంచి మొదటి మూడు స్థానాల్లో నిలవడంతో వారికి ప్రశంస పత్రాలను ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భవిష్యత్‌లు ఎన్నుకునే అవకాశం విద్యార్థుల చేతుల్లోనే ఉందన్నారు. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలంటే ప్రణాళిక బద్ధంగా వెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు స్వరూప్‌ సింగ్‌, శ్రీకాంత్‌, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement