నిరుపేద కార్యకర్తకు జీవనోపాధి | - | Sakshi
Sakshi News home page

నిరుపేద కార్యకర్తకు జీవనోపాధి

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

నిరుపేద కార్యకర్తకు జీవనోపాధి

గోవిందరావుపేట: మండల పరిదిలోని చల్వాయి గ్రామానికి చెందిన నిరుపేద కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్త గణపాక సుధాకర్‌ కుటుంబం జీవనోపాధి కోసం ఫాస్ట్‌ ఫుడ్‌ స్టాండ్‌ను కాంగ్రెస్‌ నాయకులు ఆదివారం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు పైడాకుల అశోక్‌ ఆర్థిక సాయంతో నాయకుడు పైడాకుల కృష్ణమూర్తి ఈ స్టాండును సుధాకర్‌కు బహూకరించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ.. కార్యకర్తల సంక్షేమమే కాంగ్రెస్‌ లక్ష్యమన్నారు. తేళ్ల హరిప్రసాద్‌, వేల్పుగొండ ప్రకాష్‌, చాపల నరేందర్‌ రెడ్డి, మల్లారెడ్డి, పడిదల సాంబయ్య, సామ శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement