ముగిసిన విద్యా వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ముగిసిన విద్యా వారోత్సవాలు

May 19 2026 1:10 AM | Updated on May 19 2026 1:10 AM

ముగిసిన విద్యా వారోత్సవాలు

ములుగు రూరల్‌: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆదివారం విద్యా వారోత్సవాలు ముగిశాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రిన్సిపాల్‌ మల్లేశం మాట్లాడుతూ.. గత విద్యా సంవత్సరంలో కాలేజిలో చేసిన పలు కార్యక్రమాలను వివరించారు. అనంతరం ఉత్తమ అధ్యాపకులను, ఉత్తమ ప్రతిభ కనపరిచిన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు బాలయ్య, కవిత, భాస్కర్‌, శిరీష, రాధిక, అనిల్‌ కుమార్‌, ఉదయశ్రీ, విజిత, శంకర్‌, సోమన్న, జగదీశ్‌తో పాటు , తదితరులు ఉన్నారు.

ఏటూరునాగారంలో..

ఏటూరునాగారం: మండల కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వారం రోజుల పాటు చేపట్టిన విద్యా వారోత్సవాలు ఆదివారంతో ముగిసినట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కల్చరల్‌ కమిటీ కన్వీనర్‌ రమేశ్‌ తెలిపారు. ఈ సందర్భంగా కరాటేలో రాణిస్తున్న సాయిచరణ్‌ను అధ్యాపకులు సన్మానించారు. వారం రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు జ్యోతి, కనీస్‌ ఫాతిమా, జీవవేణి, రాజశేఖర్‌, శ్రీధర్‌, విద్యార్థులు పాల్గొన్నారు.

విద్యార్థులకు సన్మానం

మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్‌లో పదో తరగతి ఉత్తీర్ణత సాధించిన మండలంలోని ఐదుగురు టాపర్‌ విద్యార్థులకు ఆదివారం సన్మాన కార్యక్రమాన్ని పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెడ్మాస్టర్‌ సాంబశివరావు మాట్లాడుతూ.. చదువుతోనే విద్యార్థులకు గుర్తింపు వస్తుందన్నారు. చదువు, క్రమశిక్షణ, పట్టుదల ఉంటే సాధించనిది ఏది లేదన్నారు. విద్యార్థులు కోరంకున్నత్‌ కృష్ణ, బోడ సహస్రలక్ష్మీ, గాడిచర్ల మనిదీపిక, మండెల రక్షమయూరి, బాసాని అమృతలను సన్మానించామన్నారు. ఈ కార్యక్రమంలో రాజన్న, బాలాజీ, పద్మశ్రీ, మల్లయ్య, శ్రావణ్‌, సుమన్‌, సమ్మయ్య పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement