వెంకటాపురం(కె): మండల పరిధిలోని బోధాపురం పాఠశాల విద్యార్థులు ఆర్‌అండ్‌బీ రోడ్డుపై సోమవారం సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ బోధాపురం పాఠశాల భవనం శిథిలావస్థకు చేరి పెచ్చులు ఊడి పడుతున్నాయని తెలిపారు. దీంతో పాఠశాలకు వెళ్లేందుకు విద్యార్థులు భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. పాఠశాలకు ఐదు తరగతులకు ఒక్కరే ఉపాధ్యాయుడు ఉన్నాడని మిగిలిన ఉపాధ్యాయులను నియమించాలిని ఆందోళన చేసినట్లు తెలిపారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాఠశాల భవన నిర్మాణం చేపట్టడంతో పాటు ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.


