అధికారులను ఆదేశించిన కలెక్టర్ టీఎస్.దివాకర
ములుగు రూరల్: ప్రజావాణి, గిరివాణి(గిరిజన దర్బార్)లో స్వీకరించిన అర్జీలను అధికారులు వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ టీఎస్.దివాకర అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం ప్రజావాణి, గిరివాణి నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బాధితులు 72 అర్జీలను కలెక్టర్ టీఎస్. దివాకరకు అందజేశారు. ఈ వినతులను అదనపు కలెక్టర్ సంపత్‌రావు, ఆర్డీఓ వెంకటేశ్‌తో కలిసి కలెక్టర్ స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం చేయకుండా అధికారులు పరిష్కరించాలన్నారు. సమస్యల పరిష్కారంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి అర్జీదారులకు సమాచారం అందించాలని సూచించారు. పెండింగ్ దరఖాస్తులు లేకుండా చూసుకోవాలని ఆదేశించారు.
ప్రజావాణి, గిరివాణిలో
72 వినతుల రాక
పరిశీలించి పరిష్కరించాలని
ఆదేశాలు


