ఏటూరునాగారం: భారతరాజ్యాంగ ఆదివాసీ హక్కుల పరిరక్షణ సమితిని శనివారం ఎన్నుకున్నారు. ఈ మేరకు స్థానిక ఐటీడీఏ కార్యాలయంలో శనివారం భారత రాజ్యాంగ ఆదివాసీ హక్కుల పరిరక్షణకు జిల్లా స్థాయిలో అన్ని ఆదివాసీ సంఘాలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా చందా లింగయ్య దొర హాజరయ్యారు. ఆయన సమక్షంలో నూతన సమితిని ఎన్నుకున్నట్లు వివరించారు. జిల్లా కన్వీనర్‌గా ఈసం యాదయ్య, కో కన్వీనర్లుగా చందా మహేశ్, కాపుల సమ్మయ్య, ఈసం రాజు, తోలం సుధాకర్, గలి సమ్మయ్య, ఇండ్ల సమ్మయ్య, నల్లబోయిన లక్ష్మణరావు తదితరులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మయ్య, పోడెం బాబు, శ్రీనాధ్, పాయం సత్యనారాయణ, శ్రావణ్, రవి, వీరయ్య, కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


