గృహ ప్రవేశంలో పాల్గొన్న రాష్ట్ర మంత్రి సీతక్క
ప్రజా దర్బార్‌లో వినతులు స్వీకరిస్తున్న మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర
ఎస్‌ఎస్‌తాడ్వాయి: గ్రామాల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధిశాఖ మంత్రి సీతక్క అన్నారు. అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంతిల్లు కట్టించి అంకంపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్నారు. అంకంపల్లిలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశంతోపాటు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి అంకంపల్లి వరకు రూ.83 లక్షలతో బీటీ రోడ్డు నిర్మాణానికి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతీ పేద కుటుంబానికి సొంతల్లు ఉండాలన్నదే ప్రభుత్వ సంకల్పమని అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా ఆ కల సాకారమవుతుందన్నారు. గ్రామీణ జీవనోపాధికి బొంగు చికెన్, ఇప్ప పువ్వు వంటి స్థానిక వనరులను ఆదాయ మార్గాలుగా మలుచుకోవాలన్నారు. అర్హులైన ముగ్గురికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అదే గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించిన మంత్రి సీతక్క.. పిల్లలకు అందుతున్న పౌష్టికాహారం, మౌలిక సదుపాయాలపై పిల్లలను అడిగి తెలుసుకున్నారు. గంగారం గ్రామపంచాయతీ పరిధిలోని అన్నారంలో రూ.15 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం పనులకు మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ సంపత్‌రావు, జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ రేగ కల్యాణి, సర్పంచులు బడే రజిత, వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్, మేడారం జాతర మాజీ చైర్మన్ లచ్చుపటేల్, జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి, జిల్లా కార్యదర్శి సునీల్, మండల ఉపాధ్యక్షుడు నాగేశ్వర్‌రావు, నార్లాపూర్ సర్పంచ్ కృష్ణ, ఉప సర్పంచ్ భాస్కర్‌రెడ్డి ఉన్నారు.
యోగాతోనే సంపూర్ణ ఆరోగ్యం
ములుగు: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని, రోజువారీ జీవనశైలిలో యోగా ను ఒక భాగంగా అలవర్చుకోవాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ధనసరి సీతక్క అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన భవన్‌లో హోమియోపతి పితామహుడు డాక్టర్ క్రిస్టియన్ ఫ్రెడరిక్ శామ్యూల్ హానిమాన్ జయంతి సందర్భంగా శుక్రవారం నిర్వహించిన ప్రపంచ హోమియోపతి (ఆయుష్ డే) దినోత్సవానికి సీతక్క హాజరయ్యారు. కలెక్టర్ దివాకర టీఎస్‌తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ప్రతీ రోజు 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు యోగా చేయడం ద్వారా శరీరం, మెదడు చురుకుగా పనిచేస్తాయని తెలిపారు. పురా తన కాలం నుంచి యోగాసనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉందని, సంపూర్ణమైన ఆరోగ్యం ద్వారా మా త్రమే మనిషి తన ఆశలను, ఆశయాలను, ఉన్నత లక్ష్యాలను చేరుకుంటాడని తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క అధికారులు, ఆయుష్ సి బ్బంది, క్రీడాకారులు, క్రీడాభిమానులతో కలిసి యోగాసనాలు వేసి అందరిని ఉత్తేజ పరిచారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, కౌన్సి లర్లు, మెడికల్ కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం
వెంకటాపురం(కె): అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తామని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలకేంద్రంలో తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన ప్రజా దర్బార్‌లో వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం, మంగపేట, ఏటూరునాగారం మండల ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. కంకలవాగు బ్రిడ్జి నిర్మాణ పనులు, పాలెం, చొక్కాల, వెంకటాపురం మండలకేంద్రంలో సీసీ రోడ్లు, రాచపల్లి పంచాయతీ మొట్లగూడెం గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించి గిరిజనులతో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను విడతల వారీగా అందిస్తామని అన్నారు. కార్యక్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కలెక్టర్ దివాకర, తహసీల్దార్ వేణుగోపాల్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క
అంకంపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల
గృహప్రవేశం


