మంగపేట: ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల పంటకు మద్ధతు ధర లభిస్తుందని రాష్ట్ర ఉపాధిహామీ మండలి (టీఎస్‌ఈజీసీ) సభ్యుడు గుమ్మడి సోమయ్య అన్నారు. మండల కేంద్రంలోని గంపోనిగూడెం మార్కెట్ యార్డు వద్ద జ్యోతి మండల సమాఖ్య ఆధ్వర్యంలో సెర్ఫ్ ద్వారా గణనాయక గ్రామైఖ్య సంఘం ద్వారా ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సోమయ్య శుక్రవారం ప్రారంభించారు. అకినేపల్లి మల్లారంలో వివేకా ఫార్మర్స్ ప్రొడ్యూసర్స్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పౌరసరఫరాలశాఖ జిల్లా మేనేజర్ కృష్ణవేణి, డిప్యూ టీ తహసీల్దార్ విజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సోమయ్య మాట్లాడుతూ ఏ గ్రేడ్ రకం ధాన్యం క్వింటాకు రూ.2,389, కామన్ గ్రేడ్ క్వింటాకు రూ.2,369 ప్రభుత్వం మద్దతు ధర, సన్నరకం ధాన్యం క్వింటాకు రూ.500 బోనస్ చెల్లిస్తున్నట్లు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కొనుగోలు కేంద్రాలను నిర్వహిస్తున్న మహిళా సంఘాలకు ప్రభుత్వం నుంచి పూర్తి సహాయసహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ భద్రునాయక్, డీసీ ఎస్‌ఓ ఫజల్ హైమద్ షైనీ, డీఆర్‌డీఓ ఏపీడీ గొట్టె శ్రీనివాస్, డీపీఎం హెచ్‌ఆర్ కోటేశ్వర్‌రావు, డీపీఎం దేవానంద్, సీ్త్రనిధి ఆర్‌ఎం అశోక్, ఏపీఎం సత్యనారాయణరెడ్డి, మిర్చీ టాస్క్‌ఫోర్స్ కమిటీ సభ్యు డు నాసిరెడ్డి సాంబశివరెడ్డి సీసీలు, వీఓ లీడర్లు, మహిళా పొదుపు సంఘాల లీడర్లు పాల్గొన్నారు.


