వరంగల్ స్పోర్ట్స్: ములుగు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నేడు, రేపు(11,12 తేదీల్లో) 11వ తెలంగాణ ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పగడాల వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలకు రాష్ట్ర వ్యాప్తంగా 552 మంది క్రీడాకారులు, 28 మంది టెక్నికల్ అఫిషియల్స్, 20 మంది వలంటీర్లు పాల్గొంటున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు త్వరలో జరగనున్న ఫెడరేషన్ కప్ జూనియర్, సీనియర్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు.
అంతర్‌జిల్లాల ఓపెన్ టు ఆల్ టెన్నీస్ పోటీలు
వరంగల్ జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ సుబేదారిలోని వరంగల్ క్లబ్ వేదికగా శని, ఆదివారాల్లో తెలంగాణ అంతర్ జిల్లాల స్థాయి ఓపెన్ టు ఆల్ టెన్నిస్ పోటీలను నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ ప్రెసిడెంట్ జయసింహరెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలకు ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్‌రెడ్డి, గండ్ర సత్యనారాయణ హాజరై ప్రారంభిస్తారని పేర్కొన్నారు.


