ములుగు: ఈనెల 13వ తేదీ నుంచి 18 వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పిలుపునిచ్చారు. గురువారం డీజీపీ శివధర్‌రెడ్డి, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్‌రాజ్, ప్రిన్సిపల్ సెక్రటరీ (ఆరోగ్యం) క్రిస్టినా చోంగ్తూ, సెక్రటరీ (ప్లానింగ్) గౌరవ్ ఉప్పల్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్‌వీ కర్ణన్, సీఐపీఆర్ ప్రియాంకతో కలిసి ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ములుగు నుంచి కలెక్టర్ దివాకర టీఎస్, ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ పాల్గొన్నారు. వీసీలో సీఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ.. జిల్లా రోడ్డు భద్రత కమిటీ సమావేశాలను తరచూ నిర్వహిస్తూ ఈనెల 13 నుంచి 18వ తేదీ వరకు ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. జిల్లాలో వారం రోజుల పాటు నిర్వహించనున్న కార్యక్రమాలను పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు


