ములుగు: ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు టాస్ (తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ) పరీక్షలు నిర్వహించనున్నట్లు అదనపు కలెక్టర్ మహేందర్‌జీ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓపెన్ ఎస్సెస్సీ, ఓపెన్ ఇంటర్మీడియట్ పరీక్షల కోసం ములుగులో 4 పరీక్ష కేంద్రాలు, ఏటూరునాగారంలో 6 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణలో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పరీక్ష కేంద్రాల్లో భద్రతా ఏర్పాట్లు, వైద్య సదుపాయాలు, విద్యుత్ సరఫరా, రవాణా సౌకర్యాలు, ఇతర ఏర్పాట్లు సమయానికి పూర్తిచేయాలని సూచించారు. ఆర్డీఓ వెంకటేశ్, డీఈఓ సిద్ధార్థరెడ్డి, డీఎస్పీ కిశోర్, డీపీఓ వెంకయ్య, డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు, ఎస్‌ఈ ఎన్పీడీసీఎల్ ఆనందం, ఆర్టీఓ శ్రీనివాస్, ఏసీజీఈ వినోద్‌కుమార్ పాల్గొన్నారు.
అదనపు కలెక్టర్ మహేందర్‌జీ


