ఏటూరునాగారం: మండలంలోని గంటలకుంట అటవీ సమీపంలోని గొత్తికోయగూడేల్లో అటవీశాఖ అధికారులు తీసిన ట్రెంచ్‌లో పడి గురువారం ఒక ఆవు మృతి చెందింది. అటవీశాఖ అధికారులు గోతులు తీయడంతోనే ఆవు మృతి చెందిందని గొత్తికోయ గిరిజనులు ఆరోపిస్తున్నారు.
ఏటూరునాగారం: గ్రామంలోని ప్రజలు విద్యుత్‌ను వృథా చేయకుండా ఆదా చేయాలని ఏటూరునాగారం విద్యుత్‌శాఖ డివిజన్ ఇంజనీరింగ్ అధికారి పురుషోత్తం అన్నారు. గురువారం మండల పరిధి 12వ వార్డులో ప్రజల సమస్యపై విద్యుత్ ప్రజా బాట కార్యక్రమాన్ని వార్డు సభ్యురాలు కొయిల కృష్ణవేణి ఆధ్వర్యంలో చేపట్టారు. అనంతరం డీఈ మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధులు వార్డు పరిధిలో ప్రతి ఇంటిని సందర్శించి, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలను తెలుసుకున్నారు. వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏఈ స్వామి, లైన్ ఇన్‌స్పెక్టర్ కొండా సమ్మయ్య, బీఆర్‌ఎస్ నాయకుడు కాళ్ల రామకృష్ణ, సిబ్బంది అమర్, సతీశ్, పాల్గొన్నారు.


