ఛత్తీస్‌గఢ్‌ ధాన్యం రాకుండా చర్యలు | - | Sakshi
Sakshi News home page

ఛత్తీస్‌గఢ్‌ ధాన్యం రాకుండా చర్యలు

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

వాజేడు: ఛత్తీస్‌గఢ్‌ నుంచి ధాన్యం తెలంగాణకు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ అన్నారు. మండల పరిధిలోని చెరుకూరు గ్రామం వద్ద 163వ జాతీయ రహదారిపై అంతర్రాష్ట్ర ధాన్యం తనిఖీ కేంద్రాన్ని బుధవారం ఆయన రిబ్బన్‌ కత్తిరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా మహేందర్‌జీ మాట్లాడుతూ పక్క రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌ నుంచి మన రాష్ట్రంలోకి ధాన్యం రాకుండా అధికారులు నిరంతరం విధులు నిర్వహించాలని సూచించారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లపై పక్కాగా ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్‌ కృష్ణవేణి, సివిల్‌ సప్లయీస్‌ అధికారి సయ్యద్‌ షా ఫైజల్‌ హుస్సేన్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, సివిల్‌ సప్లయీస్‌ డీటీ విజయ్‌ కుమార్‌, వాజేడు డీటీ రాంసింగ్‌ తదితరులు పాల్గొన్నారు.

అదనపు కలెక్టర్‌ మహేందర్‌జీ

Advertisement
 
Advertisement
Advertisement