వెంకటాపురం(కె): ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న వైద్య సిబ్బంది, వైద్యాధికారులు విధుల్లో అంకిత భావంతో పనిచేయాలని, నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని వైద్య ఆరోగ్యశాఖ జిల్లా సూపరింటెండెంట్ కాలకుర్తి జగదీశ్వర్ అన్నారు. మండల కేంద్రంలోని సామాజిక వైద్యశాలలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గర్భనిరోధక చట్టం, తల్లి, శిశు సంరక్షణ చట్టంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణులు పౌష్టికాహారం తప్పకుండా తీసుకోవడంతో పాటు వైద్యుల సూచనలు పాటించాలన్నారు. డెలివరీలకు ప్రభుత్వ వైద్యశాలలను ఆశ్రయించాలన్నారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవద్దని సూచించారు. ప్రైవేటు వైద్యశాలల్లో లింగ నిర్ధరణ పరీక్షలు చేయరాదని హెచ్చరించారు. అనంతరం వైద్యశాలలోని వైద్యులు, సిబ్బందితో కలిపి సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యశాల సూపరింటెండెంట్ సురేశ్‌కుమార్, వైద్యాధికారులు ప్రవిద్, ప్రదీప్, శివాజీ, సిబ్బంది శాంతకుమారి, ఉషా, వరలక్ష్మి, నాగలక్ష్మి పాల్గొన్నారు.


