పెండింగ్‌ మెస్‌ బిల్లులు విడుదల చేయాలి | - | Sakshi
Sakshi News home page

పెండింగ్‌ మెస్‌ బిల్లులు విడుదల చేయాలి

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

పెండింగ్‌ మెస్‌ బిల్లులు విడుదల చేయాలి

ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కిరణ్‌

ములుగు రూరల్‌: పెండింగ్‌లో ఉన్న మెస్‌ బిల్లులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామెర కిరణ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు హస్టళ్లలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నారని తెలిపారు. అలాంటి వారికి కాస్మోటిక్‌ బిల్లులు చెల్లికపోవడం బాధాకరమని తెలిపారు. మెస్‌ బిల్లుల పెండింగ్‌ కారణంగా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు. ప్రభుత్వం స్పందించి పెండింగ్‌ మెస్‌, కాస్మోటిక్‌ బిల్లులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోకిల బాలు, రాకేష్‌, లక్ష్మన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement