ఆరు గ్యారంటీలను అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆరు గ్యారంటీలను అమలు చేయాలి

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

ములుగు రూరల్‌: రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి భీరెడ్డి సాంబశివ డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలో బుధవారం నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. కేరళ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి విజయన్‌కు ఓటు వేస్తే మోదీకి వేసినట్టేనని మతిభ్రమించి మాట్లాడటం సరికాదన్నారు. కేరళ రాష్ట్రంలో విద్యారంగానికి 24 శాతం బడ్జెట్‌ కేటాయిస్తుందని తెలిపారు. అదే మన రాష్ట్రంలో 8శాతం కేటాయించిందన్నారు. రాష్ట్రంలో విద్య వ్యాపారంగా మారిందని తెలిపారు. రాష్ట్రంలో మహిళలకు రూ.2500, వ్యవసాయ కూలీలకు రూ. 12 వేలు ఇస్తామని అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తుమ్మల వెంకట్‌రెడ్డి, కొర్ర రాజు, ప్రవీణ్‌, సద్దాం హుస్సేన్‌, రవీందర్‌, చంటి, రూప్‌సింగ్‌, పాణి, భరత్‌, లక్ష్మణ్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం జిల్లా కార్యదర్శి సాంబశివ

Advertisement
 
Advertisement
Advertisement