అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన విద్యాబోధన | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాల్లో మెరుగైన విద్యాబోధన

Apr 9 2026 7:23 AM | Updated on Apr 9 2026 7:23 AM

జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రేమలత

ఎస్‌ఎస్‌తాడ్వాయి: అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తున్నట్లు జిల్లా సంక్షేమశాఖ అధికారి ప్రేమలత తెలిపారు. పీఅండ్‌జీ ప్రథమ్‌ ఆధ్వర్యంలో పాఠశాల సంసిద్ధత మేళా కార్యక్రమాన్ని మండల పరిధిలోని పంబాపూర్‌ సెక్టార్‌ పరిధిలో గల దామెరవాయి అంగన్‌వాడీ కేంద్రంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆమె హాజరై మాట్లాడారు. అంగన్‌వాడీ పాఠశాలలు ప్రైవేట్‌ పాఠశాలలకు ధీటుగా పని చేస్తున్నాయన్నారు. పిల్లలకు ఆటపాటల ద్వారా విద్యను బోధిస్తున్నట్లు తెలిపారు. రెండేళ్ల పిల్లల వరకు ఉండే వెయ్యి రోజుల ప్రాధాన్యతను వివరించారు. అనంతరం ప్రథమ్‌ మాస్టర్‌ బండారి అనిల్‌ పిల్లలకు ఆటలపోటీలు నిర్వహించారు. 65 మంది పిల్లలు ఆటలు, పాటలు, కథలు, సంభాషణ, పూర్వ గణిత భావనలు, ఫ్రీ స్కూల్‌ వస్తువుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. అనంతరం చిన్నారులకు డీడబ్ల్యూఓ ప్రేమలత, సర్పంచ్‌ వట్టం తిరుపతి చేతుల మీదుగా ప్రోగ్రెస్‌ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నితీష్‌, రాజేందర్‌, ఉప సర్పంచ్‌ నగేశ్‌, టీచర్లు సావిత్రి, అమృత, నిర్మల, వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement