ఏటూరునాగారం: కేజీబీవీలో చదువుకుంటున్న విద్యార్థినులు పరీక్షలకు ప్రణాళికతో చదవి ఉత్తమ ఫలితాలు సాధించాలని డీఈఓ సిద్ధార్థరెడ్డి సూచించారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని డీఈఓ ఆకస్మికంగా మంగళవారం తనిఖీ చేశారు. అనంతరం ఆయన విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు శ్రద్ధతో చదివి పరీక్షల్లో వందశాతం మార్కులు సాధించాలన్నారు. అనంతరం మీసేవ కేంద్రాన్ని సందర్శించి ఐటీ, ఐటీఈఎస్ వృత్తి విద్యలో భాగంగా ఇంటర్న్‌షిప్ చేస్తున్న విద్యార్థులతో మాట్లాడారు. ఐటీ, ఐటీఈఎస్ రంగంలో ఇంటర్న్‌షిప్ చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు, భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. అనంతరం పాఠశాలలోని సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఏఎంఓ శ్యామ్‌సుందర్‌రెడ్డి, కేజీబీవీ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
శాంపిల్ సర్వే సర్టిఫికెట్ల అందజేత
మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో ఎఫ్‌ఎల్‌ఎన్ శాంపిల్ సర్వే సర్టిఫికెట్లను డీఈఓ సిద్ధార్థరెడ్డి అందజేశారు. మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో సర్టిఫికెట్ల పంపిణీ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ రేణుక మాట్లాడుతూ జిల్లా విద్యాశాఖ ఈ సర్వేను ఎంచుకోవడం హర్షించదగిన విషయం అన్నారు. అనంతరం డీఈఓ మాట్లాడుతూ ఫిబ్రవరి 25 నుంచి 27వ తేదీ వరకు 53 మంది డిగ్రీ కళాశాల విద్యార్థులు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ పాఠశాలలకు ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లుగా వెళ్లిన విద్యార్థులను అభినందించారు. అలాగే సర్వేను అనుసరించి విద్యార్థుల్లో ఆంగ్లభాష ఉచ్చరణ, రాత నైపుణ్యాలను పరిశీలించి రిపోర్టు విద్యాశాఖకు అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్వాలిటీ కోఆర్డినేటర్ శ్యామ్ సుందర్‌రెడ్డి, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ వెంకటయ్య, అధ్యాపకులు నవీన్, జ్యోతి, ఫాతిమా, రమేశ్, భాస్కర్, సంపత్, రాజశేఖర్, జీవవేణి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
డీఈఓ సిద్ధార్థరెడ్డి


