ఐక్య పోరాటం ఉధృతం | - | Sakshi
Sakshi News home page

ఐక్య పోరాటం ఉధృతం

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

ఐక్య పోరాటం ఉధృతం – వివరాలు 8లోu

సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ రాష్ట్ర నలుమూలల నుంచి విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్లు, బిల్‌ కలెక్టర్‌లు, పీస్‌ రేట్‌ వర్కర్‌లు భారీ సంఖ్యలో తరలిరావడంతో మంగళవారం హనుమకొండలోని టీజీ ఎన్పీడీసీఎల్‌ ప్రధాన కార్యాలయం హోరెత్తింది. ఆర్టిజన్‌లను రెగ్యులర్‌ ఉద్యోగులుగా కన్వర్షన్‌ చేయాలని, అన్‌మ్యాన్డ్‌ డిస్ట్రిబ్యూషన్‌ వర్కర్‌లు, బిల్‌ కలెక్టర్లు, పీస్‌ రేట్‌ వర్కర్‌లను ఆర్టిజన్‌లుగా కన్వర్షన్‌ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. తెలంగాణ విద్యుత్‌ ఆర్టిజన్‌ ఉద్యోగులు జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనకు రెగ్యులర్‌ ఉద్యోగ సంఘాలు మద్దతు తెలిపాయి. – హన్మకొండ

Advertisement
 
Advertisement
Advertisement