‘రామప్ప చరిత్ర గొప్పది’ | - | Sakshi
Sakshi News home page

‘రామప్ప చరిత్ర గొప్పది’

Apr 8 2026 7:38 AM | Updated on Apr 8 2026 7:38 AM

వెంకటాపురం(ఎం): చారిత్రక రామప్ప దేవాలయం చరిత్ర ఎంతో గొప్పదని మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఈవీ.నరసింహారెడ్డి అన్నారు. మండల పరిధిలోని రామప్ప దేవాలయాన్ని మంగళవారం ఆయన సందర్శించారు. రామలింగేశ్వరస్వామికి ఆయన పూజలు నిర్వహించగా ఆలయ అర్చకులు హరీశ్‌ శర్మ, ఉమాశంకర్‌లు ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. స్వామి వారి శేషవస్త్రాలను బహూకరించారు. ఆలయ చరిత్ర, శిల్పకళ ప్రాముఖ్యత గురించి టూరిజం గైడ్‌ గోరంట్ల విజయ్‌ కుమార్‌ వివరించగా రామప్ప శిల్పకళ సంపద బాగుందని కొనియాడారు. ఆయన వెంట ప్రముఖ చరిత్రకారుడు, ప్లీచ్‌ ఇండియా ఫౌండేషన్‌ సీఈఓ ఈమని శివనాగిరెడ్డి, యువ చరిత్రకారుడు అరవింద్‌ ఆర్య, తహసీల్దార్‌ గిరి బాబు, ఆర్‌ఐ రమేశ్‌, టూరిస్ట్‌ పోలీస్‌ శ్రీనివాస్‌, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement