ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ | - | Sakshi
Sakshi News home page

ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ

Apr 2 2026 8:34 AM | Updated on Apr 2 2026 8:34 AM

ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ

ములుగు: రేషన్‌ కార్డు లబ్ధిదారులకు వేసవి కాలం దృష్ట్యా ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి సయ్యద్‌ షా ఫైసల్‌ హుస్సైని బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏప్రిల్‌, మే, జూన్‌ నెలలకు సంబంధించిన బియ్యం పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం తెలంగాణ ప్రభుత్వం పంపిణీ చేస్తుందని వెల్లడించారు. జిల్లాలో దాదాపు లక్షా 2 వేలకు పైగా కార్డులు ఉన్నాయని వివరించారు ఒకేసారి మూడు నెలలకు సంబంధించి ఒక్కో కార్డుదారుడు 3 సార్లు వేలి ముద్ర వేయాల్సి ఉందని తెలిపారు. దీనికి తోడు సర్వర్‌ సమస్యలు రాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement