హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరి | - | Sakshi
Sakshi News home page

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరి

Apr 1 2026 8:00 AM | Updated on Apr 1 2026 8:00 AM

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ తప్పనిసరి ‘అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు’

డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు

ములుగు రూరల్‌: 14 సంవత్సరాలు నిండిన బాలికలు తప్పనిసరిగా హెచ్‌పీవీ(హ్యుమన్‌ ప్యాపిలోమా వైరస్‌ వ్యాక్సిన్‌) వేసుకోవాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు సూచించారు. వ్యాధి నిరోధక టీకాల నియంత్రణ అధికారి నాగ అన్వేష్‌తో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, మిడ్‌ లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌, సూపర్‌వైజర్లతో మంగళవారం జూమ్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పీహెచ్‌సీల్లో బుధవారం నుంచి వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌ను ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. ఆరోగ్య కార్యకర్తలు 14 ఏళ్లు నిండిన బాలికల జాబితాను తయారు చేసుకుని ప్రణాళికతో బాలికలకు వ్యాక్సినేషన్‌ చేయించాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మాస్‌ మీడియా అధికారి సంపత్‌, డీడీఎం ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఏటూరునాగారం: అక్రమ అరెస్టులతో ఆదివాసీ ఉద్యమాన్ని ఆపలేరని తుడుందెబ్బ రాష్ట్ర కార్యదర్శి కోరగట్ల లక్ష్మణ్‌రావు అన్నారు. మండల కేంద్రంలో కొమురం భీమ్‌ విగ్రహం వద్ద ఆదివాసీ ప్రజా సంఘాలతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడారు. భద్రాద్రి జిల్లా నుంచి మహబూబాబాద్‌ జిల్లా గూడూరు వైపునకు వెళ్తున్న తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు మైపతి అరుణ్‌ కుమార్‌, దారం రమేశ్‌, ముక్తి రాజును బయ్యారం పోలీసులు అరెస్ట్‌ చేయడం సరికాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఆదివాసీల హక్కులను అణచివేయడం దారుణమన్నారు. అక్రమ అరెస్ట్‌లను వెంటనే రద్దు చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, నారాయణ, నరేశ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement